తొలిసారి ప్లేబాయ్ మ్యాగజైన్లో ముస్లిం మహిళ

28 Sep, 2016 12:15 IST|Sakshi
తొలిసారి ప్లేబాయ్ మ్యాగజైన్లో ముస్లిం మహిళ

లాస్ ఏంజల్స్: ప్రముఖ మ్యాగజైన్ ప్లేబాయ్ మొదటిసారిగా ఒక బురఖా ధరించిన ముస్లిం మహిళ కథనాన్ని ప్రచురించింది. దీనిపై విమర్శలు, పొగడ్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్  నెలకు చెందిన సంచికలో అమెరికాలో టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న నూర్ తగౌరి కథనాన్ని ప్రచురించింది.  అమెరికాలో ముస్లింల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ ఒక మహిళ ఎదిగిన తీరును మ్యాగజైన్ ప్రశంచింది.

లిబియా నుంచి వచ్చిన తగౌరి  బురఖా ధరించి అమెరికా టీవీలో యాంకరింగ్ చేయడమే లక్ష్యంగా కృషి  చేశారని ప్రశంసించింది. ముస్లింల పట్ల మీడియా వ్యతిరేక కథనాలను  ప్రచురిస్తోందని తగౌరి  ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్లేబాయ్ పత్రిక ప్రచురిచింది. తగౌరిని సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. అశ్లీల పత్రికగా పేరున్న ప్లేబాయ్ గత కొంత కాలంగా ఎటువంటి పోర్న్ చిత్రాలను ప్రచురించడం లేదు.
 

మరిన్ని వార్తలు