ఇంటర్నెట్లో మోదీకి అదిరే ఫాలోయింగ్

6 Mar, 2015 11:26 IST|Sakshi
ఇంటర్నెట్లో మోదీకి అదిరే ఫాలోయింగ్

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేరారు. ప్రపంచంలో గుర్తించిన టాప్ 30 మంది ప్రభావవంతమైన జాబితాలో చోటుదక్కించుకున్నారు. ప్రపంచంలో ఇంటర్నెట్ ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల వ్యక్తులపై టైం మేగజిన్ నిర్వహించిన సర్వేలో టాప్-30 మందిలో నరేంద్రమోదీకి స్థానం దక్కింది.

 

మోదీతోపాటు చోటుదక్కించుకున్నవారిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హ్యారీ పోటర్స్ సిరీస్ బ్రిటన్ రచయిత జేకే రోలింగ్, గాయకులు టేలర్, స్విప్ట్, బేయాన్స్ కూడా ఉన్నారు. నరేంద్రమోదీకి ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా 38 మిలియన్ల మంది ఉన్నారని మేగజిన్ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక అనుసంధాన వెబ్సైట్లను ఉపయోగించుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ ముందుంటారనే విషయం మనకు తెలిసిందే.

మరిన్ని వార్తలు