పాక్‌కు మరో షాక్‌..

25 Aug, 2019 20:22 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై అంతర్జాతీయ సమాజంలో మద్దతు లభించక అసహనానికి లోనవుతున్న పాకిస్తాన్‌ మరో​ కుదుపునకు లోనైంది. ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌ను అందచేయడం పాక్‌కు మింగుడుపడటం లేదు. ప్రధాని మోదీకి ఆదివారం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్‌-యూఏఈల మధ్య పెరుగుతున్న సంబంధాలకు సంకేతంగా పరిగణిస్తుంటే పాకిస్తాన్‌ మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతోంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై అంతర్జాతీయ సమాజానికి పాక్‌ ఏకరువు పెడుతున్నా మద్దతు కొరవడుతున్న క్రమంలో దుబాయ్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించడం పొరుగుదేశానికి అసంతృప్తి మిగిల్చింది. ప్రధానికి ఈ పురస్కారం ప్రకటించగానే పాక్‌ సెనేట్‌ ఛైర్మన్‌ సాధిక్‌ సంజరాని యూఏఈ పర్యటనను రద్దు చేసుకోవడం ఇవే సంకేతాలను పంపుతోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్ గురించి ఫేక్ న్యూస్‌ వైరల్‌

నాడు ఫ్లూ, నేడు కరోనాను జయించింది..

కరోనా టైమ్స్‌: ఆనంద్‌తో చెస్‌ ఆడే ఛాన్స్‌!

వారం పాటు మాస్క్‌లపై కరోనా వైరస్‌

కరోనా: బ్రిటన్‌ రాణి వీడియో సందేశం

సినిమా

రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట