ట్రంప్కు మోదీ, పుతిన్ అభినందనలు

9 Nov, 2016 15:22 IST|Sakshi
ట్రంప్కు మోదీ, పుతిన్ అభినందనలు

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. అమెరికా-భారత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో భారత్తో ఉన్న అనుభందాన్ని స్నేహాన్ని ప్రస్థావించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు.

అలాగే, మరో అగ్ర రాజ్యం రష్యా అభినందనలు తెలియజేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ట్రంప్కు టెలిగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని తాను ఆశిస్తున్నట్లు అందులో పుతిన్ పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి సాగాలని తాము భావిస్తున్నామన్నారు. అంతేకాదు.. రష్యాలోని మేజర్ పార్టీలన్నీ కూడా ట్రంప్కు అభినందనలు తెలియజేశాయి.

రష్యాకు అనుకూలంగా ప్రచారం సమయంలో ట్రంప్ మాట్లాడటాన్ని అదనుగా చేసుకొని హిల్లరీ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ట్రంప్కు రష్యాతో వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకే పుతిన్కు అనుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నారని ఆమె ఆ సమయంలో ఆరోపించారు కూడా.

మరిన్ని వార్తలు