మస్కట్‌ శివాలయంలో మోదీ పూజలు

12 Feb, 2018 17:47 IST|Sakshi
మస్కట్‌ శివాలయంలో ప్రధాని మోదీ పూజలు

మస్కట్‌ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మస్కట్‌లోని మత్రా ప్రాంతంలోని 125 ఏళ్ల కిందటి పురాతన శివాలయంలో పూజలు నిర్వహించారు. మస్కట్‌ శివాలయంలో పూజలు చేయడం తనకు లభించిన అదృష్టంగా ప్రధాని ట్వీట్‌ చేశారు. గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు 125 ఏళ్ల కిందట ఈ శివాలయాన్ని నిర్మించగా 1999లో పునరుద్ధరించారు.ఈ ప్రాంగణంలో శ్రీ ఆది మోతీశ్వర్‌ మహదేవ్‌, శ్రీ మోతీశ్వర్‌ మహదేవ్‌, శ్రీ హనుమాన్‌ దేవాలయాలున్నాయి. పవిత్ర దినాల్లో ఈ దేవాలయాన్ని దాదాపు 15,000కు పైగా భక్తులు సందర్శిస్తుంటారు.

మరోవైపు 2001లో ప్రారంభించిన ఒమన్‌ ప్రధాన మసీదు సుల్తాన్‌ ఖబూస్‌ గ్రాండ్‌ మసీదునూ  సందర్శించారు. ఇక తన ఒమన్‌ పర్యటన నేపథ్యంలో గల్ప్‌ దేశాలతో భారత ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమవుతుందని ప్రధాని ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు