మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించిన మోదీ

4 Sep, 2019 20:49 IST|Sakshi

మాస్కో:  భారత్‌, రష్యా దేశాలు మధ్యవర్తిత్వానికి వ్యతిరేకమని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం మాస్కో పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసిన సందర్భంగా మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.   మోదీ మాట్లాడుతూ తమ దేశ అంతర్గత సమస్యలను తామే పరిష్కరించుకుంటామని వేరే దేశాల ప్రమేయం అవసరం లేదని తెలిపారు. మోదీ సర్కారు తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, భారత రాజ్యాంగానికి అనుగుణంగానే జరిగిందని రష్యా అధి​కార వర్గాలు తెలిపాయి. 

పుతిన్‌ మాట్లాడుతూ భారత్‌, రష్యా మధ్య 15 రంగాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. వీటిలో ముఖ్యంగా వాణిజ్యం, ఇందనం, రక్షణ రంగంలో ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తాయని వెల్లడించారు. తమిళనాడులోని కుడుంకుళం అణుఒప్పందం ద్వారా 3.3 మిలియన్ల ఇంధనాన్ని భారత్‌కు సరఫరా చేశామని పుతిన్‌ గుర్తుచేశారు. రష్యా అత్యున్నత పౌరపురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను పుతిన్‌కు మోదీ కృతజ​తలు తెలిపారు. ఇది యావత్‌ భారత్‌దేశం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు