వింగ్తో ఉబ్బసానికి చెక్!

29 Oct, 2015 16:22 IST|Sakshi

వాషింగ్టన్: చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిపై ఉబ్బసం వ్యాధి(ఆస్థమా) ప్రభావాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో మరింత ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవడం జరుగుతోంది. ఉబ్బసం వ్యాధి బారిన పడకుండా ముందుగానే వ్యాధి సంకేతాలను గుర్తించి హెచ్చరించడానికి అమెరికా శాస్త్రవేత్తలు 'వింగ్' అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. జేబులో ఇమిడేంత చిన్నదిగా ఉండే ఈ పరికరాన్ని స్మార్ట్ ఫోన్తో అనుసంధానించి ఉపమోగించవచ్చు. అమెరికాకు చెందిన స్పారో లాబ్స్ దీనిని రూపొందించింది.


వాతావరణంలో ఉబ్బసం వ్యాధి కారకాలను ముందుగానే పసిగట్టి ఫోన్కు సమాచారాన్ని అందించేలా వింగ్ను రూపొందిచారు. హెడ్ఫోన్ను అనుసంధానించే జాక్ ద్వారా ఫోన్కు కనెక్ట్ చేసేలా దీనిని తయారు చేయడంతో వింగ్కు ప్రత్యేకంగా చార్జింగ్, బ్యాటరీల అవసంరం లేదు. వింగ్ ఉబ్బసంతో పాటు శ్వాసవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను ముందుగానే పసిగడుతుంది. క్రానిక్ పల్మొనరీ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం గుర్తించి ఫిజీషియన్కు సమాచారాన్ని చేరవేసేలా దీనిని తయారు చేశారు. ప్రస్తుతం వింగ్ 'అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' పరిశీలనలో ఉందనీ, త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పారో లాబ్స్ తెలిపింది.
 

మరిన్ని వార్తలు