చాక్లెట్లలో విషం.. 2 వేల మందికి అస్వస్థత

13 Jul, 2015 18:22 IST|Sakshi
చాక్లెట్లు తిని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు (ఇన్సెట్: విషపదార్థాలు కలిసి చాక్లెట్లు)

మనీలా: ఇంటి గంట కొట్టగానే పొలోమంటూ పరుగెత్తిన చిన్నారులు చాక్లెట్ల బండ్ల చుట్టూ మూగి.. ఇష్టమైన మ్యాంగో ఫ్లేవర్ క్యాండీలను కొనుక్కొని తింటూ ఇంటిబాట పట్టారు. అలా ఇల్లు చేరారోలేదో ఒకటే కడుపు నొప్పి, వాంతులు, విరేచినాలు. కంగారుపడ్డ తల్లితండ్రులు పిల్లలను తీసుకుని ఆసుపత్రులకు పరుగుపెట్టారు. అలా ఒకరిద్దరుకాదు వందలాది చన్నారులు సహా  2000 మంది అస్వస్థతకు గురయ్యారు. పిలిఫ్పీన్స్లో కలకలం రేపిన ఈ 'విషం చాక్లెట్ల' వ్యవహారం కాకతాళీయమా లేక కుట్రపూరితమా? అని పోలీసులు శోధిస్తున్నారు.

దక్షిణ ఫిలిప్పీన్స్లోని పలు ప్రాంతాల్లో గత బుధవారం వేల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు తోపుడు బండ్ల మీద మ్యాంగో క్యాండీలు కొనుక్కొని తిన్నారు. కొద్దీ సేపటికే తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్న 2 వేల మందిలో 66 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని పిలిఫ్పీన్స్ ఆరోగ్య శాఖ ప్రతినిధి లీ సుయ్ సోమవారం మీడియాకు తెలిపారు.

సదరు బండ్లలో అమ్మిన చాక్లెట్లన్నీ 'వెండీస్ డెలిషియస్' అనే కంపెనీ తయారు చేసినవే కావడం గమనార్హం. ఇప్పటికే ఈ కంపెనీపై పలు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుత ఆరోగ్య విలయానికి కారణమైన చాక్లెట్ పాకెట్ల మీద కూడా ఎక్స్పైరీ డేట్ సహా కీలక సమాచారమేదీ ముద్రించి ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. చాక్లెట్ల తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున వెండీస్ కంపెనీపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు