విషప్రయోగం నుంచి కోలుకున్న యులియా

10 Apr, 2018 16:39 IST|Sakshi
యులియా స్క్రిప్పల్‌ (పాత ఫొటో)

లండన్‌ : విష ప్రయోగానికి గురైన రష్యన్‌ మాజీ గుఢాచారి కుమార్తె యులియా కోలుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం డిచార్జ్‌ అయ్యారు. యులియా తండ్రి  సెర్గీ స్క్రిప్పల్‌ రష్యన్‌ ఆర్మీ అధికారిగా పనిచేస్తూనే బ్రిటన్‌కు డబుల్‌ ఏజెంట్‌గా వ్యవహరించారన్న వార్తల మధ్య.. గత నెల 4వ తేదీన తండ్రీకూతుళ్లపై విషప్రయోగం జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు మృత్యువుతో పోరాడిన యులియా పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు ఆమెను ఆస్పత్రి నుంచి డిచార్జ్‌ చేశారు.

కాగా, భవిష్యత్తులో కూడా యులియా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఆవకాశం ఉండటంతో బ్రిటిష్‌ అధికారులు ఆమెను ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. ఇప్పటికి ప్రాణాపాయం తప్పినా, చికిత్స కొనసాగించడం ఆవసరమని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశామని వైద్యులు పేర్కొన్నారు. అటు యులియా తండ్రి సెర్గీ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. వీరిపై విషప్రయోగం వెనుక రష్యన్‌ మిలటరీ ప్రమేయం ఉందని బ్రిటన్‌ ఆరోపిస్తున్నది. అయితే రష్యా మాత్రం ఈ ఘటనలతో తమకే సంబంధంలేదని తెలిపింది.

మరిన్ని వార్తలు