జైలు పాలైన మాజీ అధ్యక్షుని కుమారుడు

15 Aug, 2016 21:35 IST|Sakshi
జైలు పాలైన మాజీ అధ్యక్షుని కుమారుడు

కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారున్ని మనీ లాండరింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నిమల్ రాజపక్స (30) ను అరెస్టు చేసిన పోలీసులు  కొలంబో లోని న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ఈ నెల 22 వరకు న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. నిమల్  హమ్బన్ టోటా నియోజకవర్గం నుంచి  ఎంపీగా ఎన్నికయ్యారు. ('క్రికెట్' కుంభకోణం: మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్ట్)


మహింద రాజపక్సే ముగ్గురు కుమారులు సైతం అక్రమ ఆస్తుల కేసులో  జైలు జీవితాన్ని గడిపారు.ఇటీవలే ఆయన రెండో కుమారుడు యోషితా అక్రమ టెలివిజన్ వ్యాపార లావాదేవీలో అరెస్టయి బైలుపై బయటకు వచ్చారు. రాజపక్స సమీప బందువులు సైతం అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అక్రమ వ్యవహారాలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

మరిన్ని వార్తలు