190 కోట్ల నగదు.. 400 హ్యాండ్‌బ్యాగ్‌లు

26 May, 2018 04:54 IST|Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌కు చెందిన అపార్ట్‌మెంట్లలో పోలీసులు సోదాలు నిర్వహించి దాదాపు రూ.190 కోట్ల (2.86 కోట్ల  డాలర్ల) విలువైన నగదు, అత్యంత ఖరీదైన 400 హ్యాండ్‌బ్యాగ్‌లను జప్తు చేశారు. మరెన్నో ఆభరణాలు, చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణలే తాజా ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. మలేసియా ప్రభుత్వానికి చెందిన 1ఎండీబీ అనే సంస్థ డబ్బునూ నజీబ్, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు కలసి కాజేశారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గతవారం రోజుల్లో నజీబ్‌ ఇల్లు సహా 12 చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు