అమెరికాకు తప్పిన మరో ముప్పు!

13 Jun, 2016 12:34 IST|Sakshi
అమెరికాకు తప్పిన మరో ముప్పు!

శాంటా మోనికా: అమెరికాకు మరో ముప్పు తప్పింది. ఆర్లెండో నైట్ క్లబ్ లో నరమేధం జరిగిన కొద్ది గంటల్లోనే దక్షిణ కాలిఫోర్నియాలో మరో సాయుధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ హోలాండ్ గే పరేడ్ వైపు వెళుతున్న జేఫర్సన్ విల్లేకు చెందిన జేమ్స్ వెస్లే హొవెల్(20) అనే వ్యక్తిని ఆదివారం శాంటా మోనికాలో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

వెస్ట్ హోలాండ్ లో స్వలింగ సంపర్కుల ర్యాలీలో పాల్గొనేందుకు అతడు వెళుతున్నట్టు గుర్తించారు. ఆర్లెండో నైట్ క్లబ్ దాడితో అతడికి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. వెస్ట్ హోలాండ్ లో స్వలింగ సంపర్కుల ర్యాలీలో హింసకు పాల్పడేందుకే వెళుతున్నట్టు హొవెల్ చెప్పాడని శాంటా మోనికా పోలీస్ చీఫ్ జాక్వెలైన్ సీబ్రూక్స్ ట్వీట్ చేశారు. తర్వాత ఆమె తన ప్రకటనను సరి చేసుకున్నారు. పరేడ్ కు వెళుతున్నానని మాత్రమే అతడు చెప్పాడని తెలిపారు.

హొవెల్ వెనుక ఎవరున్నారనే దానిపై ఎఫ్ బీఐ దర్యాప్త్ చేస్తోంది. అతడి ఫేస్బుక్ పోస్టింగులను పరిశీలించింది. నియంత అడాల్ఫా హిట్లర్ కోట్ ను హిల్లరీ క్లింటన్ మాటలతో పోలుస్తూ జూన్ 3న ఫొటో పోస్ట్ చేశాడు. ఎయిర్ ఫిల్టర్ కంపెనీలో హొవెల్ ఆడిటర్ గా పనిచేస్తున్నట్టు ఫేస్బుక్ స్టేటస్ లో ఉంది.

మరిన్ని వార్తలు