లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

23 Dec, 2018 04:44 IST|Sakshi

దుబాయ్‌: యూఏఈలోని షార్జాలో సోషల్‌ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో అడ్డుకుని ప్రాణాల ను కాపాడారు. సోషల్‌ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన తన చిత్రానికి ఎక్కువగా వ్యతిరేక స్పందనలు రావడంతో మనస్తాపం చెందిన యువతి బలవ న్మరణానికి యత్నించిందని పోలీసులు తెలిపారు. షార్జాలోని ఏ1 నహదా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో సోషల్‌ మీడియాలో వీడియో లైవ్‌ పెట్టి ఆత్మహత్యకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టగా...ఆ యువతి తండ్రి తలుపు తీశాడు. పోలీసులు కన్పించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆ యువతిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్‌ ఇప్పించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు