ఫిల్టర్‌తో కాలుష్యాన్ని కొట్టేయొచ్చు!

28 Sep, 2016 01:49 IST|Sakshi
ఫిల్టర్‌తో కాలుష్యాన్ని కొట్టేయొచ్చు!

ముక్కుకు కర్చీఫ్ అడ్డుకట్టుకొని కొందరు, ఆసుపత్రుల్లో మాత్రమే వాడే మాస్క్‌లతో కొందరు... ప్రత్యేకమైన వస్త్రంతో తయారైన మాస్క్‌లతో మరికొందరు! కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు జనాలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వేసుకోవడం, తీసుకోవడంతో ఇబ్బందులు, చర్మ సంబంధమైన సమస్యలు. ఇంత చేసినా  వీటితో ప్రభావమూ కొంతే. కానీ ఫొటోలో కనిపిస్తున్న మాస్క్ మాత్రం మొత్తం కాలుష్యాన్ని తొలగించి స్వచ్ఛమైన గాలి మీకందిస్తుందని అంటున్నారు పారిస్‌కు చెందిన కారొలిన్.

ప్రత్యేకమైన ఫిల్టరింగ్ వ్యవస్థ ఉన్న ఈ స్కార్ఫ్ గాలిని శుభ్రం చేయడంతోపాటు, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా వాయు కాలుష్యం ఎప్పుడు ఎంతుందో కూడా మీకు తెలుపుతుంది కూడా. ప్రస్తుతానికి నమూనా స్థాయిలో మాత్రమే ఉన్న ఈ హైటెక్ స్కార్ఫ్ వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి వస్తుందని అంచనా.

మరిన్ని వార్తలు