చర్చ్‌ సభ్యులపై పోప్‌ ఆగ్రహం

23 Dec, 2016 01:22 IST|Sakshi
చర్చ్‌ సభ్యులపై పోప్‌ ఆగ్రహం

సంస్కరణలు అడ్డుకుంటున్నారని ధ్వజం  
వాటికన్ సిటీ: వాటికన్ చర్చ్‌లో సంస్కరణల అమలులో ఎదురవుతున్న వ్యతిరేకతను పోప్‌ ఫ్రాన్సిస్‌ గురువారం తీవ్రంగా తప్పుపట్టారు. ఆ వ్యతిరేకతలో కొన్ని దైవదూత వలే వేషం వేసుకున్న దుష్ట శక్తి ప్రోద్బలంతో జరుగుతున్నాయన్నారు. గురువారం క్రిస్మస్‌ శుభాకాంక్షల సందేశంలో భాగంగా... తన బృందంలోని సభ్యులు క్యాథలిక్‌ చర్చ్‌ కోసం పనిచేయాలంటే కచ్చితంగా శాశ్వత పరిశుద్ధులుగా ఉండాలన్నారు. వరుసగా మూడో ఏడాది కూడా పోప్‌ వాటికన్ అధికార యంత్రాగం తీరుపై విమర్శలు గుప్పించారు.

2013లో తాను ఎన్నుకున్న సంస్కరణల ప్రకియ లక్ష్యం వాటికన్ చర్చ్‌లో పైపై మార్పుల కోసం కాదని... తన సహచరుల్లో పూర్తి స్థాయి మానసిక మార్పే లక్ష్యమని పేర్కొన్నారు. ‘ప్రియ సహోదరులారా... చర్చికి ఏర్పడ్డ ముడతల కోసం కాదు... మరకల గురించి మీరు భయపడాలి’ అని సందేశమిచ్చారు.

మరిన్ని వార్తలు