పోర్న్ హబ్ భారీ ఆఫర్

7 Oct, 2016 08:35 IST|Sakshi
పోర్న్ హబ్ భారీ ఆఫర్

లాస్ ఏంజిల్స్: అడల్ట్ వెబ్‌సైట్ పోర్న్ హబ్, అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ చోరీకి సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ఇచ్చింది. చోరీలో పాల్గొన్న దుండగుల సమాచారం ఇచ్చిన వారికి 50వేల డాలర్లు(దాదాపు 33 లక్షలు రూపాయలు) రివార్డుగా ప్రకటించింది. పారిస్‌లో కిమ్ కర్దాషియన్ చోరీకి గురవ్వడం చాలా బాధాకరం అని  పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరే ప్రైస్ అన్నారు. పోర్న్ హబ్ కుటుంబంలో కిమ్ ఓ సభ్యురాలుగా భావిస్తున్నాము. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకొని కిమ్‌కు న్యాయం జరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాము. చోరీకి సంబంధించి సమిష్టిగా కృషి చేసి దుండగులను పట్టుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్న్ హబ్ అభిమానులను ఆయన కోరారు.

ఆదివారం తెల్లవారుజామున కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు