అమ్మలూ ఈ హెచ్చరిక వినండి!

25 May, 2016 12:48 IST|Sakshi
అమ్మలూ ఈ హెచ్చరిక వినండి!

న్యూయార్క్: మాతృమూర్తులకు అమెరికాకు చెందిన ఓ అధ్యయన సంస్థ హెచ్చరికలు చేసింది. తమ చిన్నారుల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ద్వారా లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ అధ్యయనం తెలిపింది. అప్పుడే జన్మించిన తమ పిల్లల ఫొటోలను ప్రతి రోజు ఫేస్ బుక్ లో పెట్టే విద్యావంతులైన తల్లులు, ఆయా సంస్థల్లో పనిచేసే మాతృమూర్తులు అనవసరంగా మానసిక ఒత్తిడికి లోనవుతారని ఆ అధ్యయనం పేర్కొంది. ఎందుకంటే అలా తమ పిల్లల ఫొటోలు పోస్ట్ చేసిన తల్లులు వెంటనే ఎన్ని లైక్లు వచ్చాయని, కామెంట్స్ ఎన్ని వచ్చాయని చూస్తారని, పాజిటివ్ గా రాకుంటే అనవరసం ఒత్తిడికి గురవుతారని తెలిపింది.

అమెరికాలోని ది ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ అధ్యయనం నిర్వహించారు. అది కూడా ఎక్కువగా చదువుకున్న తల్లుల మీదే. వీరి అధ్యయనం ప్రకారం ఎక్కువగా చదువుకున్న మహిళలు తామే గొప్ప తల్లులం అనిపించుకోవాలని, పిల్లలను గొప్పగా పెంచుతున్నాం అని నలుగురి నుంచి మన్నన పొందాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ లో తమ చిన్నారుల ఫొటోలు పోస్ట్ చేస్తారట. వాటి వెంటే భావోద్వేగంతో నిండిన మాటలు కూడా అందులో పెడతారంట. తిరిగి వాటికి సానుకూల స్పందన రాకుంటే మాత్రం తీవ్రంగా డిప్రెషన్కు లోనవుతారని వారు చెబుతున్నారు. ఇది క్రమంగా ఒక జబ్బుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అసలు ఆ ఫొటోలు పోస్ట్ చేయడం కన్నా మానేయడమే మంచిదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు