ఆ సమయంలో అలర్ట్గా లేకుంటే ఇక అంతే!

23 Jun, 2016 12:49 IST|Sakshi
ఆ సమయంలో అలర్ట్గా లేకుంటే ఇక అంతే!

వాషింగ్టన్: గర్భిణీ స్త్రీలు సరైన అహారం తీసుకోనట్లయితే పుట్టబోయే పిల్లలు అనారోగ్యానికి గురవుతారన్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం పుట్టబోయే పిల్లలకు మాత్రమే పరిమితం కాదు.. రాబోయే మూడు తరాలకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. ప్రెగ్నెన్సీ సమయంలో ఫాస్ట్ఫుడ్, ఎక్కువ కొలెస్ట్రాల్తో కూడిన అహారాన్ని అధికంగా తీసుకున్న వారి సంతానంలో మూడు తరాల పాటు స్థూలకాయత్వం ముప్పు ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. అందుకే గర్భిణీ స్త్రీలు అహారం విషయంలో చాలా అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అహారపు అలవాట్లు పిల్లల్లో డయబెటిస్, హృదయ సంబంధ సమస్యలపై అత్యధికంగా ప్రభావం చూపుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కెల్లీ మోలీ తెలిపారు. ఇక ప్రెగ్నెన్సీకి ముందు మహిళల శరీర బరువు కూడా జన్యుపరంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు