గర్భిణి ఆకతాయి చర్య.. వైరల్‌..

25 Apr, 2018 20:12 IST|Sakshi

బీజింగ్‌: చిన్న పిల్లలు అన్నాక అపుడప్పుడు అనుకోకుండా తప్పులు చేస్తారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులను ఎవరైనా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం నాలుగేళ్ల బాలుడు చేసిన చిన్న తప్పుకు పగబట్టి గాయలయ్యేలా చేసింది. తన కాలు అడ్డుపెట్టి అతడు కిందపడేలా చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది. వివరాల్లోకి వెళితే చైనాలోని రెస్టారెంట్‌కి ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి భోజనానికి వెళ్లింది. ఆ బాలుడు రెస్టారెంట్‌ ఎంట్రీ డోర్‌ వద్ద ఆడుతూ..అటు ఇటూ తిరుగుతున్నాడు.​ ఆ రెస్టారెంట్‌ డోర్‌కి దగ్గరలో ఉన్న ఓ టేబుల్‌ వద్ద సదరు 7 నెలల గర్భిణి తన భర్తతో కలిసి భోజనం చేస్తోంది.

ఈ క్రమంలో ఆ బాలుడు డోర్‌ వద్ద నుంచి లోపలికి వెళ్తుండగా.. అక్కడ ఉన్న ప్లాస్టిక్‌ పరదా ఆ మహిళకి తాకి ప్లేట్‌లో ఉన్న భోజనం ఆమెపై పడింది. దీంతో కోపానికి గురైన మహిళ..మరోసారి డోర్‌ వైపు వస్తున్న బాలుడికి కాలు అడ్డం పెట్టింది. అది గమనించని బాలుడు వేగంగా వచ్చి మెట్లపై పడిపోయాడు. అక్కడే ఉన్నఆ జంట బాలుడిని లేపడానికి కూడా ప్రయత్నించలేదు. దూరంలో ఉన్న బాలుడి తల్లి వచ్చి బాబుని ఆస్పత్రిలో చేర్చింది.

అయితే ఆ బాలుడు తనంతట తానే కింద పడిపోయాడని తల్లి భావించింది. కానీ బాలుడు కోలుకున్నాక అసలు విషయం చెప్పాడు. వెంటనే ఆమె రెస్టారెంట్‌కి వెళ్లి సీసీ కెమోరా దృశ్యాలు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. ఆమెకు 1000 యువాన్ల (దాదాపు రూ.10,500) జరిమానా కూడా విధించారు. అయితే ఆమె గర్భిణీ అని తెలుసుకున్న బాలుడి తల్లి కేసు విత్‌డ్రా చేసుకుంది. తనకు పిల్లలు ఉన్నారని మానవత్వంతో వదిలేస్తున్నాని ఆమె చైనా మీడియాకు తెలిపారు. ఆ వీడియో చైనాలో వైరల్‌ కావడంతో నిందితురాలు సిగ్గుతో తలదించుకుంది. వెంటనే ఆస్పత్రికి వచ్చి బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని చెప్పింది. తాను చేసిన పొరపాటును క్షమించాలని బాలుడి తల్లిదండ్రులను కోరింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా