-

భూమి చుట్టూ రక్షణ కవచం!

28 Nov, 2014 03:06 IST|Sakshi
భూమి చుట్టూ రక్షణ కవచం!

వాషింగ్టన్: స్టార్ ట్రెక్ సిరీస్‌లో కనిపించే భారీ స్పేస్ షిప్ చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఆవరించి ఉంటుంది. గ్రహాంతర వాసులు ప్రయోగించే ఆయుధాలను ఆ శక్తి క్షేత్రం అడ్డుకుంటూ అంతరిక్ష నౌక(అంతరచిత్రంలో)ను కాపాడుతూ ఉంటుంది. అది కల్పితమే అయినా, మన భూగోళం చుట్టూ నిజంగానే అలాంటి అదృశ్య క్షేత్రం ఆవరించి ఉండి నిరంతరం మనను రక్షిస్తోందట.

ఈ అదృశ్య క్షేత్రం భూమి నుంచి 11,600 కి.మీ. ఎత్తులో ఉందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎలక్ట్రాన్లు, ప్రొటాన్లతో గోడలా ఏర్పడి ఉన్న ఈ రక్షణ కవచమే అంతరిక్షం నుంచి దూసుకు వచ్చే ‘కిల్లర్ ఎలక్ట్రాన్ల’ను, రేడియేషన్‌ను అడ్డుకుంటోందట.

సౌర తుపాన్ల వల్ల విడుదలై సెకనుకు 1,60,934 కి.మీ. వేగంతో దూసుకువచ్చే కిల్లర్ ఎలక్ట్రాన్లు భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే గనక.. వాతావరణం మారిపోవడం, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలడం, ఉపగ్రహాలు స్తంభించడం, మనుషులకు కేన్సర్ల ముప్పు పెరగడం వంటివి సంభవించేవని, కానీ ఈ అదృశ్య క్షేత్రం మనల్ని కాపాడుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు