ట్రంప్ ర్యాలీలో ఘర్షణ

29 May, 2016 09:50 IST|Sakshi
ట్రంప్ ర్యాలీలో ఘర్షణ

వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ ర్యాలీలో మళ్లీ ఘర్షణ. కాలిఫోర్నియాలోని శాండియాగోలో ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం కేకలు వేసుకుని, నీళ్ల సీసాలు విసురుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి సుమారు 35 మందిని అరెస్టు చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసినందుకు శాండియాగో పోలీసులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించారని ట్వీట్ చేశారు.


జూన్ 7న కాలిఫోర్నియా ప్రైమరీలో ఎన్నికలు జరగనున్నాయి. మెక్సికో సరిహద్దు సమీపంలో ఆ ప్రాంతం ఉన్నందున ఆందోళనకారులు ట్రంప్ ర్యాలీని అడ్డుకున్నారు.  అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టనున్నట్లు గతంలో ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, విరాళాల సేకరణ కోసం చేసిన తొలి యత్నంలోనే ట్రంప్ రూ. 40 కోట్లు సేకరించారు.
 

మరిన్ని వార్తలు