పీవోకేలో పాక్‌ వ్యతిరేకంగా నిరసనలు 

19 Dec, 2018 09:04 IST|Sakshi

ముజఫరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నీలం-జీలం నదిపై పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్మించబోయే హైడ్రోపవర్‌ప్లాంట్‌ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ.. ముజఫరాబాద్‌ ప్రజలు రొడ్డెక్కారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని, మరే ఇతర ప్రాజెక్టులను చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.

వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల తమ జీవనం దెబ్బతింటోందని, వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పుడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతికేకంగా గత వారం రోజులుగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు