ఉత్తర కొరియా అధ్యక్షుడికి రష్యా హెచ్చరిక!

10 Mar, 2016 11:13 IST|Sakshi
ఉత్తర కొరియా అధ్యక్షుడికి రష్యా హెచ్చరిక!

మాస్కో: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దుందుడుకు చర్యలను తగ్గించుకోవాలని రష్యా సూచించింది. శత్రుదేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కిమ్ చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ న్యాయ చట్టాల ఉల్లఘన కిందకు వస్తుందని, తద్వారా ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగే చట్టపరమైన అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ రాష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

అంతర్జాతీయ అణ్వాయుధ నిరోధక చట్టాలను దిక్కరిస్తూ హైడ్రోజన్ బాంబు ప్రయోగం నిర్వహించి కిమ్ దూకుడును ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతరం అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ, బాలిస్టిక్ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం చేదించేలా అణ్వాయుధాలను సూక్ష్మీకరించడంలో ఉత్తర కొరియా విజయం సాధించినట్లు కిమ్ ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా, ఉత్తర కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా చర్యలపై రష్యా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు