లండన్‌ వీధిలో పరుగులు

6 Aug, 2018 08:44 IST|Sakshi

లండన్‌ : ఎటు నుంచి వచ్చిందో.. హఠాత్తుగా ఊడిపడిన ఓ కొండచిలువ లండన్‌ నగర వీధుల్లో హల్‌చల్‌ చేసింది. తూర్పు లండన్‌లోని ఓ వీధిలో ప్రత్యక్షమైన కొండచిలువను చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. ఇంతలో అక్కడ ఆహారం తింటున్న పావురంపై దాడి చేసిన పాము దాన్ని మింగేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌లైఫ్‌ సంరక్షణ అధికారులు కొండచిలువను పట్టుకుని, సురక్షిత ప్రదేశానికి తరలించారు.

తాను అటుగా నడుచుకుంటూ వెళ్తున్నానని, ఒక్కసారిగా కొండచిలువను చూసి షాక్‌కు గురయ్యాయని స్థానికుడు ఒకరు తెలిపారు. ఆ సమయంలో తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పారు. కొండచిలువ దాడి పావురం బలి కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు