-

ఖతార్‌కు దెబ్బపై దెబ్బ

8 Jun, 2017 07:36 IST|Sakshi
ఖతార్‌కు దెబ్బపై దెబ్బ

ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన కార్యాలయాలన్నింటిని 48 గంటల పాటు మూసేయాలని సౌదీ అరేబియా జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు జారీ చేసిన లైసెన్స్‌లను ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే ఖతార్‌ నుంచి రాకపోకలను సౌదీ నిషేధించింది. సాదీ తాజా నిర్ణయంతో ఖతార్‌కు మరో షాక్‌ తగిలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలపై ఖతార్‌తో దౌత్యపరమైన సంబంధాలను ఉపసంహరించుకుంటున్నట్లు బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌, లిబియా, మాల్దీవులు పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు