ఇద్దరు మహిళల నుంచి 36 కోట్ల దోపిడీ!

23 Nov, 2016 08:54 IST|Sakshi
ఇద్దరు మహిళల నుంచి 36 కోట్ల దోపిడీ!

పారిస్‌: ఫ్రాన్స్‌లో ధనిక విదేశీ మహిళలు లక్ష్యంగా దోపిడీలు కొనసాగుతున్నాయి. గతనెలలో పారిస్‌లో అమెరికన్‌ టీవీ నటి కిమ్‌ కర్దాషియన్‌, మొన్న బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌లపై దోపిడీ ఘటనలను మరువకముందే.. మంగళవారం ఇద్దరు ఖతార్‌ దేశానికి చెందిన మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. వీరి వద్దనుంచి 5 మిలియన్‌ యూరోలు (దాదాపు రూ.36 కోట్లు) దోచేశారు.

దాదాపు 60 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు లే బౌర్జెట్‌ విమానాశ్రయం నుంచి కార్లో బయలుదేరి లాండీ టన్నెల్‌లోకి రాగానే వీరి వాహనాన్ని ఇద్దరు మాస్క్‌ వేసుకున్న యువకులు  చుట్టుముట్టారు. కార్లోకి చొచ్చుకొచ్చి వజ్రాలు, దుస్తులు, ఇతర సామాగ్రిని లాక్కెళ్లారని తెలిసింది. ఈ విమానాశ్రయానికి ప్రజలు ఎక్కువగా రాకపోయినా అప్పుడప్పుడు ప్రైవేట్‌ జెట్‌లు వస్తుంటాయి.

మరిన్ని వార్తలు