గూగుల్‌కు రాజన్‌ ఆనందన్‌ గుడ్‌బై

2 Apr, 2019 15:23 IST|Sakshi

అమెరికన్ టెక్ జెయింట్‌ గూగుల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్‌ రాజీనామా చేశారు. ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన గూగుల్‌కు సేవలందించిన గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా  వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్ ఆనందన్ సంస్థను వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల చివరి వరకు గూగుల్‌లోనే కొనసాగుతారు.

పలు స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్న ఆనందన్‌ వెంచర్ ఫండ్ సీక్వోయా క్యాపిటల్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.  ప్రస్తుతం ఉన్న ఆరుగురు మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు ఆనందన్ సంస్థలో నాయకత్వ జట్టులో చేరినట్లు సీక్వోయా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర జి. సింగ్ లింక్డ్ఇన్ పోస్ట్ లో తెలిపారు.

మరోవైపు రాజన్‌ స్థానంలో ప్రస్తుత గూగుల్ సేల్స్‌ కంట్రీ డైరెక్టర్‌ వికాస్ అగ్నిహోత్రి తాత్కాలిక బాధ్యత తీసుకుంటారని గూగుల్‌ వెల్లడించింది. అలాగే గత ఎనిమిదేళ్ళ కాలంలో తమ సంస్థకు విశేష సేవలందించి నందుకుగాను రాజన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గూగుల్  ప్రకటించింది. 

కాగా, మైక్రోసాఫ్ట్ ఇండియా నుంచి 2010లో ఆనందన్ గూగుల్‌లో చేరారు. అంతకుముందు ఆయన డెల్ ఇండియా, మెకిన్సే అండ్‌ కంపెనీల్లో పని చేశారు.

మరిన్ని వార్తలు