సిరిసేన పార్టీతో రాజపక్స తెగదెంపులు

12 Nov, 2018 05:52 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహింద రాజపక్స(72) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు హ్యాండిచ్చారు. సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో తన 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని కొత్తగా ఏర్పాటైన శ్రీలంక పీపుల్స్‌ పార్టీలో చేరారు. గత ఏడాది ఏర్పాటైన ఈ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనూహ్యంగా మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాజపక్స ఎస్‌ఎల్‌పీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో జనవరి 5న జరిగే ఎన్నికల్లో రాజపక్స ఎస్‌ఎల్‌పీపీ నుంచి బరిలోకి దిగుతారని భావిస్తున్నారు.

సిరిసేన ఉత్తర్వులను అమలు చేయొద్దు
చట్ట సభ్యుల అధికారాలను హస్తగతం చేసుకున్న అధ్యక్షుడు సిరిసేన జారీ చేసే ఎలాంటి ఉత్తర్వులను కూడా అమలు చేయవద్దని పార్లమెంట్‌ స్పీకర్‌ కరు జయసూర్య అధికార యంత్రాంగాన్ని కోరారు.  

మరిన్ని వార్తలు