ఆస్ట్రేలియాలో మందుబాబుల కోసం 2.ఓ సినిమా

15 Feb, 2019 18:05 IST|Sakshi

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా పోలీసులు మందుబాబుల్లో మార్పుకోసం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 2.ఓ చిత్ర సన్నివేశాన్ని చూపిస్తున్నారు. రజనీకాంత్‌కే కాదు, ఆయన నటించిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ ఉందన్న విషయం తెలిసిందే. జపాన్, కెనడా, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో రజనీకి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఆయన చిత్రాల ప్రభావం ఉందని తెలిసింది. వివరాలు చూస్తే.. ఇటీవల దక్షిణ ఆస్ట్రేలియాలోని టోర్ఫీ ప్రాంత పోలీసులు రాత్రుల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మందుబాబులను అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేయడం లేదు. బదులుగా వారికి మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు.

అందుకు పోలీసులు రజనీ నటించిన 2.ఓ చిత్రంలోని సన్నివేశాలను అధికారిక పూర్వకంగా వినియోగిస్తున్నారు. వాహన తనిఖీల్లో ఒక వ్యక్తిని టెస్ట్‌ చేయగా.. అతను 0.341 ఆల్కాహాల్‌ సేవించినట్లు గుర్తిస్తారు. అంత మద్యం సేవించిన వారు శస్త్ర చికిత్సలో ఉన్నవారికి, కోమాలో ఉన్న వ్యక్తికి సమానం అని సన్నివేశంలో ఉంది. ఈ సన్నివేశాన్ని చూపిస్తూ మందుబాబులకు పోలీసులు అవగాహనను కల్పిస్తున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో రజనీకాంత్‌ అభిమానులు ఇతర మందుబాబుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు.

>
మరిన్ని వార్తలు