చైనా సరిహద్దుల్లో 50 శిబిరాలు!

25 Oct, 2017 01:38 IST|Sakshi

ఐటీబీపీ పోస్టులను ఏర్పాటు చేస్తామన్న రాజ్‌నాథ్‌ సింగ్‌

నోయిడా: భారత్‌–చైనా సరిహద్దుల్లో పహారా కాసే ఐటీబీపీ (ఇండో–టిబెటన్‌ సరిహద్దు దళం) సిబ్బంది కోసం 50 ఉష్ణ నియంత్రిత శిబిరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పనిచేస్తుంటారనీ, వారి కోసం 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఈ శిబిరాలను రూపొందించేందుకు యోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఐటీబీపీ 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బంది ప్రయోజనాల కోసం రాజ్‌నాథ్‌ పలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో 25 సరిహద్దు రహదారులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.  సరిహద్దుల్లో ఉపగ్రహా, మొబైల్‌ కనెక్టివిటీని కూడా పెంచుతామన్నారు.  ఐటీబీపీలో సేవలందిస్తున్న ఒక అశ్వం, ఒక జాగిలాన్ని రాజ్‌నాథ్‌ నాలుగు కాళ్ల హీరోలుగా పేర్కొంటూ వాటికి పతకాలు ప్రదానం చేశారు.  

మరిన్ని వార్తలు