స్పైసీ ఫుడ్ అంటే మీ కిష్టమా..

6 Aug, 2015 12:36 IST|Sakshi
స్పైసీ ఫుడ్ అంటే మీ కిష్టమా..

సాక్షి: కొందరికి ఘాటైన మసాలా ఫుడ్ అంటే చాలా ఇష్టం. అలాంటి మసాలా ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొందరు నిపుణల సూచన. అయితే మసాలా ఫుడ్ తినడం వల్ల ప్రయోజనం కూడా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. తరచూ ఇలాంటి ఆహారం తీసుకునే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని అధ్యయన సారాంశం. మసాలా ఫుడ్‌తో గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని చైనీస్ అకాడెమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన పరిశోధకులు అన్నారు.


'ఇంతకు ముందు జరిపిన అనేక అధ్యయనాల ప్రకారం కొన్ని రకాల మసాలా దినుసులకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఔషధ గుణాలున్నాయి. ఎర్ర మిరియాలు,  క్యాప్సైసిన్ (మిరప) వంటి దినుసులు బయో యాక్టివ్ ఏజెంట్లుగా పనిచేయడంతో పాటు స్థూలకాయం, హృద్రోగాలు, మధుమేహంలాంటి రోగాలు దరిచేరకుండా కాపాడుతాయి. ఇవి మాత్రమే కాకుండా అనేక దినుసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వాటిపై ప్రజల్లో ఉన్న అవగాహన తక్కువే. వ్యాధుల నివారణలో, మరణాల రేటు తగ్గించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి' అని అధ్యయన వేత్తలు తెలిపారు. 30-79 ఏళ్ల వయస్సున్న దాదాపు ఐదు లక్షల మందిని 2004-2008 వరకు అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లు, మసాలా ఫుడ్ ఇష్టపడే అంశాలు, ఆరోగ్యం, తదితర అంశాలను అధ్యయనం చేశారు. వారానికి మూడు కంటే ఎక్కువ రోజులు మసాలా ఫుడ్ తినే వారు మిగతావారితో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్లు, వీరిలో మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మరిన్ని వార్తలు