ఒంటికాలి జపం అందుకేనట!

26 May, 2017 09:28 IST|Sakshi
ఒంటికాలి జపం అందుకేనట!

వాషింగ్టన్‌ : ఫ్లెమింగోలు..రెండు కాళ్లపై కాకుండా ఒంటికాలిపైనే ఎందుకు నిలబడతాయో తెలుసా. వాటికి రెండు కాళ్లపై నిలుచోవడం కంటే ఒకదానిపై నిలబడడమే తేలిక. అంతేకాకుండా ఈ భంగిమలో నిలబడడం వల్ల వాటికి తమ శక్తి ఆదా అవుతుందట, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఒంటికాలిపై నిలబడిన సమయంలో కండర సంబంధమైన పనులేవీ అవి చేయవని, పనిలో పనిగా ఓ కునుకు సైతం తీయగలుగుతాయని తెలిపారు. ఈ భంగిమ వల్ల వాటికి కండరాల అలసట ఉండదని గతంలో అంతా భావించేవారు.  అందుచేతనే అవి కాలు మార్చుకుంటాయే తప్ప రెండుకాళ్లను ఏకకాలంలో వినియోగించడానికి ఇష్టపడవని తెలిపారు. ఈ తరహా ప్రవర్తనద్వారా అవి తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయని జార్జియా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ,. ఎమోరి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ ట్రిక్కు వెనుకగల అనేక యాంత్రిక రహస్యాలను వారు వెలుగులోకి తీసుకొచ్చారు. 

మరిన్ని వార్తలు