రెడ్‌మీట్, గుడ్లతో మరణం!

3 Aug, 2016 11:24 IST|Sakshi
రెడ్‌మీట్, గుడ్లతో మరణం!

వాషింగ్టన్‌: ఎక్కువకాలం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రెడ్ మీట్‌ (పశుమాంసం), గుడ్లు, పాలు లాంటి జంతు ఉత్పత్తులతో మరణం తొందరగా వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

‘‘పశుమాంసం, గుడ్లు ద్వారా శరీరానికి అందిన ప్రొటీన్లు హాని చేస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకునేవారిని ఊబకాయం, అధికబరువు, బరువు తక్కువగా ఉండటం, అసహజ జీవనశైలి తదితర సమస్యలు కూడా చుట్టుముడతాయి. అదే పప్పులు, చిరుధాన్యాలు, బ్రెడ్, నట్స్‌లాంటì  వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్నవారు దీర్ఘకాలం జీవిస్తారు’’ అని చెబుతున్నారు. వీటివల్ల శరీరానికి అందే ప్రోటీన్ల వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు.  ఈ పరిశోధన కోసం 30 ఏళ్లపాటు 35లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఈ ఫలితాలను మసాచుసెట్స్‌ జనరల్‌ హస్పిటల్‌ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.

మరిన్ని వార్తలు