స్కాట్లాండ్‌ స్వాతంత్య్రంపై రెఫరెండం!

14 Mar, 2017 03:27 IST|Sakshi
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రంపై రెఫరెండం!

లండన్‌: బ్రెగ్జిట్‌ (ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలగడం) నేపథ్యంలో స్కాట్లాండ్‌ ప్రయోజనాలను బ్రిటన్‌ పట్టించుకోవడం లేదనీ, కాబట్టి యూకే నుంచి స్కాట్లాండ్‌కు స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు పార్లమెంటు అనుమతి కోరతానని స్కాట్లాండ్‌ అధ్యక్షురాలు (ఫస్ట్‌ మినిస్టర్‌) నికోలా స్టర్జన్‌ సోమవారం అన్నారు.

2014లోనే స్కాట్లాండ్‌కు స్వాతంత్య్రంపై రెఫరెండం పెట్టగా అక్కడి ప్రజలు యూకేతో కలిసి ఉండటానికే ఓటు వేయడం తెలిసిందే. ‘యూకేతోపాటు స్కాట్లాండ్‌ కూడా ఐరోపా కూటమి నుంచి బయటకు రావాలా? స్వత్రంత్ర దేశంగా ఉండి అటు యూకేతోనూ, ఇటు కూటమితోనూ సంబంధాలను నెరపాలా? అనే రెండు ఎంపికలు ప్రజలకు ఉండేలా చర్యలు తీసుకుంటా’అని స్టర్జన్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు