అందుకు అంగీకరించకుంటే మరో యుద్ధమే

6 Aug, 2015 09:02 IST|Sakshi

వాషింగ్టన్: ఇరాన్తో అణుఒప్పందానికి అంగీకరించనట్లయితే మధ్యాసియాలో మరో యుద్ధం వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా కాంగ్రెస్ను హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని తిరస్కరించినట్లయితే అతి పెద్ద తప్పు చేసినట్లవుతుందని చెప్పారు. త్వరలో ఆ దేశంతో జరగబోయే ఒప్పందాన్ని కాంగ్రెస్ సభ్యులంతా అంగీకరించాలని చెప్పారు. వాషింగ్టన్ లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో తొలిసారి ప్రసంగించిన ఆయన జూలైలో జరగనున్న టెహ్రాన్ అణుఒప్పందంపై స్పష్టంగా మాట్లాడారు.

గతంలో ఇదే వర్సిటీలో మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ ప్రసంగించారు. కెన్నడీ పాలన సమయంలో మధ్యాసియాలో నెలకొన్న అశాంతిని రూపుమాపేందుకు, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపేందుకు జూన్ 1963లో శాంతిని కొనసాగించండి అంటూ మాట్లాడారు. ఇరాన్తో అణుఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇరాన్ అణు కార్యకలాపాలపై నియంత్రణ ఉంచినట్లవుతుంది.

మరిన్ని వార్తలు