అరెస్టుకు ముందే దేవయానికి ‘దౌత్య’ మినహాయింపు!

27 Dec, 2013 01:28 IST|Sakshi

న్యూఢిల్లీ/వాషింగ్టన్: వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం వంటి ఏవైతే చర్యల నుంచి ఇప్పుడు మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నారో... ఈనెల 12న భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు అరెస్టు చేసేటప్పటికే ఆమె పూర్తిస్థాయిలో ఆ మినహాయింపు కలిగి ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడు న్యూయార్క్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా ఉన్న ఆమె ఐరాసలోని భారత శాశ్వత బృందానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఇందుకుగాను ఐరాస సాధారణ సభ ఆమెకు ఇచ్చిన ‘గుర్తింపు’ డిసెంబర్  31 వరకు వర్తిస్తుంది. ఈ ప్రకారం చూస్తే డిసెంబర్ 12న దేవయానిని అరెస్టు చేయడం ఆమె హోదాకు భంగకరమని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే వాదనను భారత్ అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది.
 

మరిన్ని వార్తలు