అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!

14 May, 2016 11:17 IST|Sakshi
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!

సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి.

ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను..  సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి.

అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే  తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి.  

సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు.

ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో  2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు.

మరిన్ని వార్తలు