బ్రిటన్‌లో మరో జార్జ్‌ ఫ్లాయిడ్‌!

19 Jul, 2020 04:55 IST|Sakshi

లండన్‌: యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ఫ్లాయిడ్‌ మరణంతో ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తరహా ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లోని ఇస్లింగ్టన్‌ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడు కత్తి కలిగి ఉన్నాడనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులు నట్టనడి వీధిలో, ప్రజలంతా చూస్తుండగానే అతని చేతులకు బేడీలు వేసి, గొంతుపై కాలువేసి ఊపిరిసలపకుండా చేశారు.

ఆ వ్యక్తి తన మెడపై కాళ్ళు తీయమని పదే పదే వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం దీన్ని నిరసిస్తూ ఆ నల్లజాతీయుడిని రక్షించేందుకు పూనుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అందుకు కారణమైన ఒక స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసు అధికారిని సస్పెండ్‌ చేశారు. మరో పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. జనం అడ్డుకోకపోతే ఇతడిని జార్జ్‌ ఫ్లాయిడ్‌ని చంపినట్టే చంపేసేవారని ప్రత్యక్ష సాక్షులు మీడియాతో చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు