రిపబ్లికన్ల ఖాతాలోకి సెనెట్, హౌస్

11 Nov, 2016 01:57 IST|Sakshi
రిపబ్లికన్ల ఖాతాలోకి సెనెట్, హౌస్
అమెరికా కాంగ్రెస్‌లో ఇక రిపబ్లికన్లదే ఆధిపత్యం
 గవర్నర్ పదవుల్ని చెరిసగం పంచుకున్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు
 
 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని సెనెట్(100), హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్‌‌స కూడా రిపబ్లికన్‌‌స ఖాతాలో చేరా యి. సెనెట్‌లో 33, ప్రతినిధుల సభలో లో 431 స్థానాలకు ఎన్నికలు జరిగారుు. సెనెట్‌లో..: అమెరికా సెనెట్‌ను ఈ సారైనా దక్కించుకోవాలన్న డెమోక్రాట్ల ఆశలు గల్లంతయ్యాయి. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఇండియానా, జార్జియా, విస్కాన్సన్, అలబామా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ ఆధిపత్యం చెల్లుబాటయ్యేందుకు వీలుచిక్కనుంది. ఇల్లినాయి, కాలిఫోర్నియా, మేరీలాండ్, కనెక్టికట్ వంటి రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు గెలుపొందారు. 
 
 అమెరికా ఎన్నికలకు ముందు సెనెట్‌లో డెమోక్రాట్లకు 44 మంది ఉండగా... ఇద్దరు స్వతంత్రులు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి 54 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 100 సీట్లలో మూడో వంతు సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 24 సీట్లు రిపబ్లికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నవే... 33 స్థానాల్లో రిపబ్లికన్లు 21, డెమోక్రాట్లు 12 గెలుచుకున్నారు. దీంతో సెనెట్‌లో రిపబ్లికన్ల బలం 51కి చేరింది. డెమోక్రాట్ల బలం 48గా ఉంది.
 
 ప్రతినిధుల సభలోనూ...: మొత్తం 435 స్థానాలు ఉండగా... ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతో పాటే వీటికి ఎన్నికలు నిర్వహించారు. రిపబ్లికన్లు 238 గెలుచుకోగా, డెమోక్రాట్లు 193 స్థానాలతో సరిపెట్టుకున్నారు. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాలి. రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 
 
 గవర్నర్ ఎన్నికల్లో చెరిసగం: 12 రాష్ట్రాలకు గవర్నర్ పదవి కోసం ఎన్నికలు జరగగా రిపబ్లికన్లు 6, డెమోక్రాట్లు 6 రాష్ట్రాల్ని గెలుచుకున్నారు.రిపబ్లికన్లు గెలిచినవి: న్యూహ్యాంప్‌షైర్, ఇండియానా, వెర్మాంట్, మిస్సోరీ, ఉటావా, నార్త్‌డకోటా. డెమోక్రాట్లు గెలిచినవి: ఓరెగాన్, వాషింగ్టన్, నార్త్ కరోలినా, మోంటానా, వెస్ట్ వర్జినీయా, డెలావేర్.ఒబామాతో ట్రంప్ భేటీ: అధ్యక్ష అధికారాలను సజావుగా కాబోయే అధ్యక్షుడిగా బదిలీ చేయడమే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. 
 
మరిన్ని వార్తలు