‘తోకతో కుక్కపిల్ల.. అచ్చం ఏనుగు తొండంలా’

14 Nov, 2019 19:25 IST|Sakshi

వాషింగ్టన్‌: కొన్ని జంతువులు ఏదో ఒక లోపంతో జన్మిస్తుంటాయి. అది సాధారణ విషయమే అయినప్పటికీ ఓ కుక్కపిల్ల మాత్రం దానికున్న లోపంతోనే ప్రపంచమంతా ఫేమస్‌ అయ్యింది. నుదుటి మీద తోకతో జన్మించిన పది వారాల వయస్సున్న ఈ కుక్కపిల్ల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ కుక్కపిల్లను చూసి పెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిస్సోరి నగర వీధుల్లో పుట్టిన ఈ కుక్క పేరు ‘నార్వాల్‌ ది లిటిల్‌ మ్యాజికల్‌ ఫ్యూరీ యునికార్న్‌’ అని డాగ్‌ రెస్య్కూ సంస్థ  ‘మాక్స్‌ మిషన్‌’ తెలిపింది. ఆ సంస్థ సిబ్బందికి ఈ కుక్కపిల్ల (నార్వాల్‌) మిస్సోరి వీధుల్లో దొరికినట్లు సమాచారం. ​కాగా రెండు కనుబొమ్మల మధ్య మొలిచిన ఈ తోక.. చిన్నగా ఉండి ఏనుగు తొండాన్ని తలపించేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సంస్థ షేర్‌ చేసిన వీడియోలో నార్వాల్‌ ఆడుకుంటున్నప్పుడు దాని తో​క అటూ ఇటూ కదులుతూ భలే ముద్దుగా ఉండటం అందర్ని ఆకట్టుకుంటోంది. నార్వాల్‌ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. దీనిని చూస్తుంటే ఓ కలలా ఉందని, ఎంతకు అమ్ముతారంటూ కామెంట్‌లు పెడుతున్నారు.


 
మాక్స్‌ మిషన్‌ సంస్థ ఇలాంటి లోపాలున్న కుక్కలను తీసుకొచ్చి వాటికి వైద్యం అందిస్తుంది. నార్వాల్‌ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని సంస్థ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా తెలిపింది. నార్వాల్‌కు స్కానింగ్‌ చేయించగా ఈ తోక ఏ శరీర భాగంతో కలసి లేనందున దానికి ఎలాంటి నొప్పి ఉండదని డాక్టర్లు తెలిపారు. అలాగే నుదుటిపై మొలిచిన ఈ తోక వల్ల కుక్కకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యవంతమైన మిగతా కుక్కల్లాగే అదీ చురుగ్గా ఆడుకోవడానికి ఎక్కవగా ఇష్టపడుతుందని పేర్కొన్నారు. అలాగే దీనిని పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే పలువురు సంస్థకు 50కి పైగా దత్తత దరఖాస్తులు వచ్చినట్లు మాక్స్‌ మిషన్‌ సంస్థ వెల్లడించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు