వీరిలో సామాజిక ఒంటరితనం అధికం

20 May, 2020 18:35 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

లండన్‌ : లాక్‌డౌన్‌ కాలంలో సాధారణ సమయంలో కంటే ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగం విపరితంగా పెరిగిపోయింది. అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో సరికొత్త విషయం వెలుగు చూసింది. వృద్దుల్లో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళుతున్న వారి కంటే రోజూ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోజువారీ ఇంటర్నెట్ వాడకం సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చని జర్నల్‌ ఏజింగ్‌ అండ్‌ సొసైటీ ఇటీవల జరిపిన పరిశోధనలో రుజువైంది. ఇందుకు ఇంగ్లాండ్‌లోని సగటు వయస్సు 64 ఏళ్లు ఉన్న 4492 మంది నుంచి డేటాను సేకరించారు. వీరిలో 19 శాతం మందిలో ఒంటరితనం అధికంగా ఉన్నట్లు, 33 శాతం మంది సామాజికంగా ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. అంటే వీరు కుటుంబంతో సరిగానే ఉండవచ్చు కానీ వీరిలో సామాజిక సంబంధాలు తక్కువగా ఉంటాయి. (25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం)

రోజూ ఇంటర్నెట్‌ వాడుతున్న వారి కంటే.. వారానికి, నెలకొకసారి ఇంటర్నెట్‌ను వినియోగించే వృద్ధులు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం తక్కువ ఉన్నట్లు యూకేలోని ఆంగ్లియా రస్కిన్‌ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో తేలింది. సమాచారం శోధించడం, ఈమెయిల్‌ పంపడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌.. ఈ మూడు ఆన్‌లైన్‌లో ఎక్కువగా చేసే పనులు. మూడింట రెండు వంతుల మంది(69 శాతం) ప్రతిరోజు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. దీనిపై పీహెచ్‌డీ స్టూడెంట్‌ స్టాక్‌వెల్‌ మాట్లాడుతూ.. రోజూ ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సామాజిక ఒంటరితనం, అసలు ఇంటర్నెట్‌ ఉపయోగించని వారి స్థాయి ఇంచుమించు ఒకే విధంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. తరచుగా ఆన్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల కొంతమంది వృద్ధులకు చుట్టూ ఉన్నవారితో భౌతిక దూరం పెరగడంతో ఎక్కువ సామాజిక ఒంటరితనం ఏర్పడుతుందన్నారు. (లాక్‌డౌన్‌ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది)

మరిన్ని వార్తలు