ఒక్కరోజులో 3డీ ప్రింటింగ్‌ బాత్రూం

29 May, 2019 08:28 IST|Sakshi

సింగపూర్‌: ఒకే రోజులో మొత్తం బాత్రూం వ్యవస్థను శాస్త్రవేత్తలు త్రీడీ సాంకేతికతతో రూపొందించారు. అందులో డ్రైనేజీ వ్యవస్థ, పైపులను నిర్మించారు. అందులో సింక్, అద్దం, షవర్, టైల్స్, గోడలు, ఫ్లోరింగ్, టాయిలెట్‌ ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసి ఒక్క రోజులోనే బాత్రూం మొత్తాన్ని వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌ మిశ్రమాన్ని రోబో.. పొరలుపొరలుగా పోస్తూ బాత్రూంను పోతపోస్తుంది.

సింగపూర్‌ లోని నాన్యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ సాంకేతికత ద్వారా సంప్రదాయ బాత్రూంల నిర్మాణం కన్నా 30 శాతం తక్కువ వ్యవధిలో నిర్మించవచ్చని తెలిపారు. కాంక్రీట్‌తో నిర్మించే వాటితో సమానంగా దృఢంగా ఉంటుందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు