మా సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి

11 Oct, 2017 17:27 IST|Sakshi

బీజింగ్‌ : అమెరికాకు చెందిన యుద్ధనౌక ఒకటి బుధవారం వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి వచ్చినట్లు చైనా ప్రకటించింది. అమెరికా యుద్ధ నౌక తమ జలాల్లోకి రావడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సార్వభౌమాధికారాన్ని అమెరికా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా యుద్ధనౌక దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశించిందని తెలియగానే.. చైనా మిలటరీ అధికారులు ఫైటర్ విమనాలను పంపినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్‌ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాదేశిక జలాల ఒప్పందాలను అమెరికా ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు దౌత్య సంబంధాపై ప్రభావం చూపే అవకాశముందని ఆయన అన్నారు.దీనిపై అమెరికా రక్షణశాఖ అధికారులు మాట్లాడుతూ..ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలిసాక స్పందిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు