చిన్నారులను చిదిమేసి, వీడియో తీసి..

6 Jun, 2016 20:50 IST|Sakshi
చిన్నారులను చిదిమేసి, వీడియో తీసి..

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిల్లలపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి కోర్టు దాదాపు 25 ఏళ్ల  శిక్ష విధించింది. లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా అఘాయిత్యాలను  ఆ వ్యక్తి చిత్రీకరించేవాడు. అక్కడితో ఆగకుండా చిన్న పిల్లలపై ఎలా లైంగిక దాడి చేయాలో చెబుతూ వాటిని ఆన్లైన్లో అమ్మకానికి కూడా పెట్టాడు. అంతే కాదు ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న దేశాల్లో పేదరికంలో ఉన్న పిల్లలను ఈ లైంగిక కూపంలోకి దించడం చాలా సులువు అంటూ ఆ వీడియోల్లో సూచనలు కూడా చేసేవాడు. దీంతో యూకేలోని అశ్ఫోర్డ్లోని కెన్ట్ ప్రాంతానికి చెందిన రిచర్డ్ హకిల్(30)దాదాపు తొమ్మిదేళ్లపాటూ మలేసియాలోని కౌలలాంపూర్లో చిన్న పిల్లలపై చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

వివరాలు.. క్రిస్టియన్ మతాభిమానినని, ఇంగ్లీష్ టీచర్గా తనను తాను పరిచయం చేసుకొని స్థానికులను నమ్మించేవాడు. పేదరికంలో మగ్గుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేని దాదాపు 200 మంది చిన్నారుల పై లైంగిక దాడికి పాల్పడ్డాట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. చిన్నారుల సంరక్షణ కేంద్రాలు, అనాథ శరణాలయాలను లక్ష్యంగా చేసుకొని ఈ తతంగాన్ని కొనసాగించాడు. 23 మంది చిన్నారులపై 71 సార్లు లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులో కోర్టు ముందు హకిల్ తన నేరాలను ఒప్పుకున్నాడు. 2006 నుంచి 2014 వరకు 6 నెలలు నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై జరిపిన లైంగిక దాడుల నేరాలను హకిల్ అంగీకరించాడు.

ఆస్ట్రేలియాలోని ఉన్నతాధికారుల సమాచారంతో హకిల్ను అరెస్ట్ చేయడానికి నేషనల్ క్రైం ఏజెన్సీ బృందం వెళ్లింది. ఆ సమయంలో అతను కుటుంబసభ్యులతో ఉన్నాడు. బెయిల్ పై విడుదలైన అతను ముందుగా నేరాలను తన తల్లి ముందు అంగీకరించాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను కలిసి జరిగినదంతా వివరించి చెప్పారు. తమ కుమారున్ని అరెస్ట్ చేయడానికి కావల్సిన సాక్షాలను కూడా ఇస్తామని తెలిపారు.అయితే బ్రిటన్ లో మాత్రం కనీసం ఒక్క నేరం కూడా నమోదుకాలేదు. మధ్యతరగతి క్రిస్టియన్ కుటుంబంలో హకిల్ జన్మించాడు.ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే గడిపే వాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు