స్మార్ట్‌ఫోన్లతో గుండె రోగులకు ముప్పు!

24 Jun, 2015 16:09 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్లతో గుండె రోగులకు ముప్పు!

లండన్: గుండెలో పేస్‌మేకర్ కలిగి ఉండే వ్యక్తులు స్మార్ట్‌ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. స్మార్ట్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు..హృదయ సంకేతాలుగా భావించి..పేస్‌మేకర్లు గుర్తిస్తే సడన్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

స్మార్ట్‌ఫోన్లను పేస్‌మేకర్లు లేదా ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్లు(ఐసీడీ)లకు  15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలోనే ఉంచాలని అమెరికా ఆహారం, ఔషణ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) గతంలోనే హెచ్చరించింది. పేస్‌మేకర్లు, ఐసీడీలు అమర్చిన 308 మంది వ్యక్తులను స్మార్ట్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలకు ఎక్స్‌పోజ్ చేయగా ఒకరు షాక్‌కు గురయ్యారని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని వార్తలు