అఫ్గాన్ పార్లమెంటుపై రాకెట్ దాడి

29 Mar, 2016 04:34 IST|Sakshi
అఫ్గాన్ పార్లమెంటుపై రాకెట్ దాడి

కాబుల్: అఫ్గానిస్తాన్ పార్లమెంటుపై తాలిబన్ ఉగ్రవాదులు సోమవారం నాలుగు రాకెట్లతో దాడి చేశారు. ఒక రాకెట్ పార్లమెంటు భవనాన్ని తాకడంతో కొంతమేర నష్టం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు రాకెట్లు భవనం పరిసర ప్రాంతాల్లో పడగా, మరొకటి దగ్గర్లోని ఆర్మీ బేస్‌లోకి దూసుకెళ్లింది.

దేశ భద్రతపై పార్లమెంట్‌కు వివరించేందుకు హోం, రక్షణ శాఖ అధికారులతో పాటు జాతీయ భద్రతా విభాగం డెరైక్టర్‌లు భవనంలోకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఎంపీ ఒకరు తెలిపారు. దాడి జరిగినా పార్లమెంటు సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. భారత్ సహకారంతో నిర్మితమైన ఈ పార్లమెంట్ భవనం కోసం రూ.600 కోట్లు ఖర్చుపెట్టారు.

మరిన్ని వార్తలు