అమెరికన్‌ ఎంబసీ సమీపంలో రాకెట్‌ దాడి..

21 Jan, 2020 08:27 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

బాగ్దాద్‌ : ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని హై సెక్యూరిటీ గ్రీన్‌ జోన్‌లో మంగళవారం ఉదయం అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో మూడు రాకెట్లు ఢీ కొన్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్‌ బాగ్దాద్‌లోని గ్రీన్‌ జోన్‌లో ప్రభుత్వ, దౌత్య కార్యాలయాలు కొలువుతీరిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఇరాన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఖాసి సులేమానిని అమెరికన్‌ దళాలు ఇరాక్‌లో హతమార్చిన క్రమంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన రేకెత్తిస్తోంది. సులేమాని మృతితో అమెరికా, ఇరాన్‌ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా రాకెట్‌ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

చదవండి : అమెరికా దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు

మరిన్ని వార్తలు