శరణార్థులు.. డ్రగ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌

28 Sep, 2017 15:26 IST|Sakshi

బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా డ్రగ్స్‌ సరఫరా

శరణార్థులమంటూ.. డ్రగ్స్‌ రవాణా

తాజాగా 8 లక్షల ట్యాబ్లెట్స్‌ పట్టివేత

అవాక్కైన భద్రతా బలగాలు

ఢాకా : మయన్మార్‌నుంచి బంగ్లాదేశ్‌కు మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు రోహింగ్యాల ముస్లింలను, ఒక బంగ్లా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. మయన్మార్‌నుంచి బంగ్లాకు భారీగా రోహింగ్యా ముస్లింలు వలస వస్తున్న నేపథ్యంలో.. శరణార్థుల మాదిరిగానే కొందరు రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లోకి వచ్చిపోతూ.. మత్తుమందులను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

తాజాగా మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌లోకి శరణార్థులగా వస్తున్న ముగ్గురి దగ్గర..  8 లక్షల మెథామెథమిన్‌ టాబ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ కమాండర్‌ యేజర్‌ రవుల్‌ అమీన్‌ తెలిపారు. ఈ టాబ్లెట్స్‌లో కోకైన్‌ అధికంగా ఉండి.. మత్తును కలిగిస్తుంది. ఈ టాబ్లెట్స్‌ను బంగ్లాదేశ్‌ యువత అధికంగా వినియోగిస్తోంది. దీనిని అరికట్టేందుకు కొన్నేళ్లుగా బంగ్లదేశ్‌ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

శరణార్థులగా మయన్మార్‌నుంచి బంగ్లాకు వస్తున్నవారిలో చాలామంది అక్రమంగా మత్తుపదార్థాలను రవాణా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా అదుపులోకి తీసుకున్నవారిలో ఒకరు పాత శరణార్థికాగా.. ఇద్దరు కొత్తగా బంగ్లాదేశ్‌కు వస్తున్న శరణార్థులని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు