పూల లోపలి అందాలు చూస్తారా

23 Oct, 2015 14:32 IST|Sakshi

మానవ మనుగడకు ఫలపుష్పాల ప్రయోజనం అంతా ఇంతా కాదు. పోషక పదార్థాలు, ఔషధాలు అందించడమే కాకుండా తమ అందచందాలతో ఆకట్టుకొని మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కంటికింపుగా సొంపులతో అలరిస్తాయి. వాటిలోనూ కంటికి కనిపించని అద్భుతాలు దాగున్నాయని ఎందరికి తెలుసు? అందుకే అందరికీ తెలిసేలా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాబ్ కెస్సెలర్ తన అత్యాధునిక మైక్రో కెమెరాతో పుష్పాల్లో, పుప్పొడి రేణువుల్లో దాగున్న అందాలను, అందమైన ఆకృతులను ఒడిసి పట్టుకున్నారు. వాటిని మన కళ్ల ముందుంచారు.

మార్ఫాలజిస్ట్ ఊల్ఫ్‌గాంగ్ స్టప్పీ, పాలినాలజిస్ట్ డాక్టర్ మేడలిన్ హార్లీ సహకారంతో పుప్పొడి రేణువుల అంతర్గర్భ ఆకృతులను తన కెమెరా కన్నుతో చిత్రీకరించి ఓ క్యాలెండర్‌ను సృష్టించారు. ఈ క్యాలెండర్ శాస్త్ర జిజ్ఞాసులను ఆకట్టుకోవడమే కాకుండా  శాస్త్రవిజ్ఞాన సంపదగా మిగిలిపోనుంది. అంబర్ లోటస్ పబ్లిషింగ్ 'ఏ పోలెన్ సీడ్స్ ఫ్రూట్-2016' పేరిట విడుదల చేసిన క్యాలెండర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.


మరిన్ని వార్తలు