రివైండ్‌ 2019: గ్లోబల్‌ వార్నింగ్స్‌

30 Dec, 2019 05:44 IST|Sakshi

 

అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే...

అమెరికా – ఉత్తర కొరియా
అణు సంక్షోభం
ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్‌ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియాలో జూన్‌ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్‌ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్‌ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు.
అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే...

ట్రంప్‌ అభిశంసనకు ఓకే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్‌ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్‌ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది.  

హాంగ్‌కాంగ్‌ భగ్గు
హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్‌ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి.  

బ్రెగ్జిట్‌ గెలుపు.. బోరిస్‌ జాన్సన్‌
2019 చివరలో బ్రిటన్‌ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్‌) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్‌ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్‌ పార్టీలోని బోరిస్‌ జాన్సన్‌ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్‌ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్‌ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్‌ వెల్లడించారు.

అమెజాన్‌ చిచ్చు
పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా